Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 14:35:17
facebook Twitter Googleplus
Photo

రానా హీరోగా నటించిన నేనే రాజు - నేనే మంత్రి విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రయిలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రానా అప్పియరెన్స్ అదిరిపోవడంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి రానాతోపాటు చిత్ర యూనిట్ మొత్తం ఇప్పుడు పబ్లిసిటీపై దృష్టి పెట్టారు. రిలీజ్ కు టైం దగ్గర పడటంతో హీరో రానా పోజులతో భారీ కటౌట్లు - పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.

మూవీ ప్రమోషన్ లో భాగంగా పంచెకట్టు పైకి కట్టిన రానా స్టిల్ తో ఓ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ సమంత ఈ హోర్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతోపాటు స్టిల్ అదిరిపోయిందంటూ కితాబిచ్చేసింది. ‘వూ.. హూ దటీజ్ మై సూపర్ స్టార్ బ్రదర్’ అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేయడంతోపాటు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆగస్టు 11న అంటూ హ్యాష్ టాగ్ కూడా చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తన సొంత విషయాలు... వుడ్ బీ నాగచైతన్య కబుర్లు.. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేనేతను హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. తొలిసారి రానా సినిమాకు ఫేవర్ గా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.

సమంత వుడ్ బీ నాగచైతన్య - రానా వరసకు బావా బావమరుదులు. ఈ ప్రకారం సమంత రానాకు బ్రదర్ అవుతాడు. నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ కావడంతో ఆల్రెడి రిలేషన్ షిప్ ఏర్పడింది కాబట్టి ఆ రిలేషన్ షిప్ నే ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.

,  ,  ,  ,  ,