Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 17:33:17
facebook Twitter Googleplus
Photo

తన మొదటి సినిమా ?అందాల రాక్షసి?లో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ క్యూట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది లావణ్య త్రిపాటి. ఈ సినిమాలో తన లుక్స్ ఎంత ఆకట్టుకున్నాయో అదే రేంజ్ లో తనకి చిన్మయి ఇచ్చిన వాయిస్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో అందరూ లావణ్యకి చిన్మయి వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అదే పాయింట్ సినిమాకి కూడా బాగా హెల్ప్ అయ్యిందని అప్పట్లో తెలిపారు కానీ, ఆ తర్వాత లావణ్య చేసిన రెండు సినిమాలకు చిన్మయి వాయిస్ చెప్పలేదు.
కానీ తాజాగా ఈ అందాల రాక్షసి అలియాస్ లావణ్య త్రిపాటికి చిన్మయి మరోసారి డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమానే భలే భలే మగాడివోయ్?. యంగ్ హీరో నాని హీరోగా, మారుతి డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాలో లావణ్య పాత్రకి మరోసారి చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని నిన్ననే లాంచ్ చేసారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు లావణ్యకి చిన్మయి చెప్పిన వాయిస్ మరోసారి అందరినీ ఆకట్టుకుంటోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన గీత ఆర్ట్స్ 2 ? యువి క్రియేషన్స్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించారు.

,  ,