Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2016 18:11:26
facebook Twitter Googleplus
Photo

అవును.. సినీ నటి అంజలికి ఓ వ్యాపారవేత్తతో వివాహమైందని, ఓ బిడ్డ కూడా పుట్టాడని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతకొన్నాళ్ల నుంచి తమిళనాటలో ఈ పుకారు తెగ చక్కర్లు కొడుతోంది. పైగా.. ఈ వార్తలపై అంజలి కూడా వెంటనే స్పందించకపోగా, కొన్నాళ్లు సైలెంట్ గా వుండటంతో అంతా నిజమేనని నమ్మేశారు కూడా. చివరికి ఈ వార్త అంజలి చెవిన పడగా.. ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. తనకు బిడ్డ పుట్టడమేంటి? ఇంకా పెళ్లే కాలేదంటూ ఆమె సదరు పుకార్లను కొట్టిపారేసింది. ఇలాంటి వదంతులు తనకెంతో బాధ కలిగించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆమధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళైంజయంతో విభేదాలంటూ అశాంతికి గురైన అంజలి.. కొన్నాళ్లు ఏ సినిమాలు చేయకుండా విశ్రాంతి తీసుకుంది. చాలాకాలం గ్యాప్ తర్వాత ఆమె ఇటీవల కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయిపోయింది. జయంరవితో 'సకలకళావల్లవన్' చిత్రంలో నటించిన ఈమె.. ప్రస్తుతం విమల్‌తో 'మాప్పిళై సింగం', రామ్ దర్శకత్వంలో 'తరమణి', విజయ్‌సేతుపతికి జంటగా 'ఇరైవి' చిత్రాల్లో నటిస్తూనే.. ఇటు తెలుగులో బాలక్రిష్ణ సరసన 'డిక్టేటర్' చిత్రంతోపాటు మరో రెండు మూవీలు చేస్తూ యమ బిజీగా వుంది. ఇలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈమెపై ఈమధ్య వదంతులు పుట్టుకొచ్చాయి. సాధారణంగా పుకార్లను ఏమాత్రం పట్టించుకోని అంజలి.. తనపై వస్తున్న తరచూ వదంతులను అలాగే పట్టించుకోలేదు. కానీ.. రానురాను ఆ ప్రచారాలు మరింత కలకలం సృష్టించడం మొదలుపెట్టాయి.

ఆ మధ్య అంజలికో చెల్లి వుందని.. ఆమె హీరోయిన్‌గా నటిస్తునట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. తనకు చెల్లెలెవరూ లేరని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా అంజలి ఒక వ్యాపారవేత్తను ప్రేమిస్తోందని, అతనితో పెళ్లి కూడా అయిపోయిందని, ఒక బిడ్డ కూడా పుట్టాడని రకరకాల ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వార్తలు ఆనోటా ఈనోటా చక్కర్లు కొడుతూ చివరికి అంజలి దగ్గరికి చేరుకోగా.. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ పుకార్లను ఆమె ఖండిస్తూ.. అసలు తానెవరినీ పెళ్లి చేసుకోలేదని... అలాంటిది తనకు బిడ్డ ఎలా ఉంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే అని అంజలి స్పష్టంచేసింది.

,  ,  ,  ,  ,