Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 15:35:17
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ తో మెగా యంగ్ హీరో బాక్సీఫీస్ దగ్గర గొడవకి దిగుతున్నాడు. వెంకీతో గొడవెందుకని కొందరు సర్థిచెప్పే ప్రయత్నం చేసినా.. పట్టించుకోవడం లేదట. ఇంతకీ విషయం ఏమిటంటే.. ? మారుతి దర్శకత్వంలో వెంకటేష్ ? నయన తార జంటగా తెరకెక్కిన చిత్రం ?బాబు బంగారం?. వచ్చే శుక్రవారం (ఆగస్టు12)న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు బాబు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వైపు వెంకీ కామెడీ మార్క్ ని క్యారీ చేస్తూనే.. బొబ్బిలి రాజా తరహా మేనరిజం ని ఫాలో అయ్యాడట బాబు.

మరోవైపు, మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ ఈ శుక్రవారమే (ఆగస్టు12)న ?తిక్క? చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తేజు సరసన లారేసా బొనేసి జతకట్టింది. ఇందులో తేజు తాగుబోతు పాత్రలో హంగామా చేయనున్నాడట. ఇటీవలే ట్రైలర్, టీజర్ తో తిక్క తిక్క చేశాడు తేజు. థమన్ అందించిన సంగీతం బాగుంది.

ఇప్పటికే సాయిధరమ్ తేజు మాస్ హీరోగా దూసుకెళ్తున్నాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ని ఏర్పర్చుకుంటున్నాడు. తేజు ?సుప్రీమ్? కూడా సరిగ్గా సూర్య 24 రిలీజైన రోజే రిలెజై దాదాపు రూ. 25కోట్లకి పైగా వసూలు చేసింది. కొంతలో కొంతైనా 24 కలెక్షన్స్ కి గండికొట్టింది. ఈ కారణంగానే వెంకీ కాస్త జంకుతున్నాడు. సినిమా ఎంత బాగున్నా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. అలా అని.. బాబు, తిక్క ఈ రెండింటిలో ఏ సినిమా వెనక్కి తగ్గేట్టు కనబడటం లేదు. ఎందుకంటే.. ఈ డేట్ కోసం ఈ రెండు సినిమాలు ఫస్ట్ నుండే ఖర్చీప్ వేసి ఉంచాయి. సో.. బాక్సీపీస్ దగ్గర ఏ బాబు తిక్క ఎక్కువ చూపిస్తాడన్నది వేచి చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,