Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 11:02:56
facebook Twitter Googleplus
Photo

మహానటి. సావిత్రి జీవిత చరిత్ర అనగానే.. మరికొన్ని పాత్రల గురించి మన దగ్గర ఆసక్తికరమైన చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా.. ఎన్టీఆర్.. ఏఎన్నార్ ల పాత్రలు ఎవరు చేయనున్నారనే డిస్కషన్ హాట్ హాట్ గా నడిచింది. ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేయించేందుకు ఒప్పించారనే రూమర్ కూడా గుప్పుమంది.

అయితే.. పెద్దాయన పాత్రలో నటించేందుకు ఎన్టీఆర్ ససేమిరా అనేశాడట. నిర్మాత నిజానికి నిర్మాత అశ్వినీ దత్ తో యంగ్ టైగర్ కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కంత్రి.. శక్తి వంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో రూపొందాయి. జయాపజాయలతో సంబంధం లేని అనుబంధం వీరిది. అయినా.. మహానటి మూవీలో తాత పాత్రలో తాను నటించడం కుదరదని చెప్పేశాడట జూనియర్. ఆ మహానుభావుడిగా కనిపించేందుకు తగిన స్థాయి తనకు లేదని అంటున్నాడట ఎన్టీఆర్. తనకు ఇంకా అంత పరిపక్వత చేకూరలేదని కూడా అన్నాడట.

ఇది కేమియో రోల్ మాత్రమే కావడంతో.. మూవీ పూర్తయ్యేలోపు ఎలాగైనా ఎన్టీఆర్ ని ఒప్పించాలని చూస్తున్నాడట అశ్వినీదత్. అయితే.. చివరివరకూ ఒకవేళ జూనియర్ ఈ రోల్ చేసేందుకు ఒప్పుకోకపోతే.. అప్పుడేం చేయాలనే అంశంపై ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,