Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 14:00:04
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాకు మంచి సీజన్ గా చెప్పుకునే సీజన్స్ లో వేసవికాలం కూడా ఒకటి. తెలుగులో ఈ సారి రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి కాగా రెండవది మహేష్ బాబు నటించిన ?బ్రహ్మోత్సవం?. ఈ రెండు సినిమాకు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో తమిళ్ డబ్బింగ్ సినిమాలు వరుసబెట్టి విడుదల అవుతున్నాయి.
కొత్తదనం ఉంటే చాలు భాషతో సంబంధం లేదన్నట్టు సినిమాలు హిట్టవుతున్నాయి. అందుకు నిదర్శనం తమిళ్ నుంచి తెలుగులోకి ఈ సమ్మర్ లో విడుదలైన సినిమాలే. సూర్య నటించిన ?24? సినిమాతో పాటు, విజయ్ అంటోనీ నటించిన ?బిచ్చగాడు? సినిమా, విశాల్ ?రాయుడు? సినిమాలు మంచి ఉదాహరణలు. అంతేకాకుండా మన తెలుగు స్టార్స్ ప్రమోషన్స్ లో వెనుకబడటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సినిమాని తీయడంతోపాటు దానిని ప్రేక్షకులవరకూ తీసుకెళ్లడం లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయడంతో తెలుగులో తమిళ్ సినిమాల హవా కొనసాగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు

,  ,  ,  ,  ,  ,  ,