Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jan-2016 14:16:39
facebook Twitter Googleplus
Photo

కళావతి అంటూ భయపెట్టేందుకు దెయ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది త్రిష. కోలీవుడ్ మూవీ అరణ్మణై2కి ఇది టాలీవుడ్ రీమేక్. ఇందులో హన్సిక కూడా దెయ్యం పాత్రలో కనిపించనున్నా.. తొలిసారిగా త్రిష ఈ రోల్ లో ఎలా ఉండనుంది అనేదే ఇప్పుడు అసలు టాపిక్.

కళావతిలో తాను కేవలం ప్రేతంగా మాత్రమే కాకుండా.. ఇంకా చాలా కీలకమైన సన్నివేశాలు కూడా ఉంటాయట. ఓ సూపర్బ్ లవ్ స్టోరీ - కామెడీ సీన్లు - కొన్ని సార్లు స్టంట్స్ కూడా చేయాల్సి వచ్చిందని చెబుతోంది. అసలు దెయ్యంగా చేయడమంటే మాటలా.. తలకాయ్ గోడకేసి కొట్టేసుకోవాలి గోడకి వేళ్లాడుతూ ఉండాలి గాల్లో ఎగురతూ ఉండాలి.. ఇన్ని స్టంట్స్ చేయడం మాత్రం పెద్ద సవాలే అంటోంది త్రిష. అయితే చాలా కాలం తర్వాత సిద్ధార్ధ్ తో చేయడం తనకు హ్యాపీగా ఉందని చెప్పింది. హన్సిక తను కలిసి చేసిన సీన్స్ రెండే ఉంటాయని ఒక పాటలో కూడా కలిసి చేశామని చెప్పిన త్రిష.. రియల్ లైఫ్ లో మాత్రం దెయ్యాలు ఉంటాయని నమ్మదట.

కళావతి తర్వాత ఈ భామ చేస్తున్న మరో సినిమా నాయకి. ఇది కూడా ప్రేతాత్మల కాన్సెప్ట్ తోనే వస్తుండడంతో.. ఇప్పుడు తాను దెయ్యాల బండి ఎక్కిన ఫీలింగ్ కలుగుతోందని అంటోంది. ప్రస్తుతం సౌత్ లో దెయ్యాల సినిమాల సీజన్ నడుస్తోందని.. సెంటిమెంట్ - కామెడీ - లవ్.. ఇలా అన్నిటినీ ఈ కాన్సెప్ట్ కు మిక్స్ చేయచ్చని చెప్పిన త్రిష.. వరుసగా దెయ్యం సినిమాల ఆఫర్స్ రావడంతో తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పింది.

,  ,