Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 14:53:07
facebook Twitter Googleplus
Photo

ఎవర్ గ్రీన్ కథానాయికల జాబితాని తయారు చేస్తే అందులో తప్పకుండా త్రిష పేరు చేరుతుందేమో. అవును మరీ... ఆమె ఎప్పుడనగా ఇండస్ట్రీకి వచ్చింది. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా పుష్కరకాలానికిపైగా నటిస్తూనే ఉంది. కానీ ఆమెలో ఇంత కూడా మెరుపు తగ్గలేదు. ఇప్పటికీ కుర్ర కథానాయకుల సరసన నటించేందుకు రెడీనే అన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న `నాయకి` సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కోసం నిన్న హైదరాబాద్ లో సందడి చేసింది త్రిష. అక్కడ ఆమె కనిపించిన విధానం చూసి మీడియా సైతం షాక్ అయ్యింది. త్రిష రోజు రోజుకీ ఇంత అందంగా తయారవుతోందేంటి అని మాట్లాడుకొన్నారు మీడియా జనాలు. మేని ఛాయ చెరగని చిరునవ్వు ఫ్యాషన్ సోయగాలు.. త్రిషని మరింత గ్లామర్ గా మార్చేస్తున్నాయి. ఏంటి ఇంత అందంగా తయారవుతున్నారు అని త్రిషని అడిగితే... ``ఎప్పుడు హ్యాపీగా ఉండటమే నా బ్యూటీ సీక్రెట్`` అని సెలవిచ్చింది.

త్రిష ఎప్పుడూ ఆనందంగా గడపటానికి ఆమెకేం కష్టాల్లేవని కాదు. అప్పుడప్పుడు పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఆమధ్య ఓ ఇండస్ట్రియలిస్ట్ తో పెళ్లి పెటాకులైంది. వేరెవరైనా అయ్యుంటే డిప్రెషన్ కి గురయ్యుండేవారు. కానీ త్రిష మాత్రం ఎదురు దెబ్బలన్నింటినీ తట్టుకొని నిలబడటం నేర్చుకొంది. పెళ్లి పెటాకులైనా సరే... మానసికంగా కుంగిపోకుండా తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టింది. ఇప్పుడు మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అయిపోయింది. అన్నట్టు త్రిషకి ఎప్పట్నుంచో ఓ హార్రర్ మూవీలో నటించాలని ఉందట. ఆ అవకాశం లేక లేక `నాయకి` చిత్రంతో రావడంతో అసలేం ఆలోచించకుండా ఆమె నటించేందుకు ఒప్పుకొందట. `నాయకి` కథని కూడా త్రిష కేవలం ఐదు నిమిషాలే విన్నదట. అంతలోనే సినిమా చేయాలని డిసైడ్ అయిపోయిందట. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించింది త్రిష. ఆమె తీసుకొంటున్న నిర్ణయాలు ఆమె గ్లామర్ ని చూసి పరిశ్రమ వర్గాలు సైతం త్రిష సూపరంతే అంటున్నారు.

,  ,  ,  ,