Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2017 11:26:24
facebook Twitter Googleplus
Photo

చెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ కు టూర్స్ అంటే మహా సరదా. కాసింత గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒక ప్లేస్ కు వెళ్లిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చక్కర్లు కొట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కావడంతో.. వెకేషన్ కి బయల్దేరిన త్రిషా కృష్ణన్.. తనకు తోడుగా ఈ సారి తన తల్లితో కలిసి ప్రయాణాలు చేయనుంది.

తల్లితో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన త్రిష "ఇప్పుడు విహార యాత్ర ప్రారంభమైంది. హాలిడేస్ మొదలయ్యాయి. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలకు బయల్దేరుదతున్నా" అని చెప్పింది త్రిష. ఇలా హాలిడేస్ అని త్రిష చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. సహజంగా సమ్మర్ లో షూటింగ్స్ తక్కువ ఉంటాయి. వీటిలో కూడా తమ పార్ట్ షూటింగ్ లేకుండా చాలా మంది హీరోయిన్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

గత వారం త్రిష తన సినిమాలపై అప్ డేట్ ఇస్తూ మోహిని.. గర్జనై.. చతురంగ వేట్టై మూవీస్ ను కంప్లీట్ చేసినట్లు చెప్పింది. వీటిలో మోహిన్ హారర్ థ్రిల్లర్ మూవీ అయితే.. గర్జనై చిత్రాన్ని బాలీవుడ్ మూవీ ఎన్ హెచ్ 10 ఆధారంగా రూపొందిస్తున్నారు.

,  ,  ,  ,  ,