స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన త్రిష.. ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. చేతిలో అరడజన్ కి పైగా సినిమాలతో రచ్చ రచ్చ చేసేస్తోంది. మధ్యలో ఈ అమ్మడు ఫిమేల్ ఓరియెంటెడ్ పిక్చర్స్ కూడా ట్రై చేసింది. హారర్ కామెడీ జోనర్ కి క్రేజ్ పెరగడంతో.. ఆ జోనర్ లో వరుసగా మూవీస్ ఒప్పుకుంది త్రిష. ఇప్పటికే నాయకి అంటూ ఓ సారి భయపెట్టేందుకు ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మోహిని అంటూ మరోసారి ప్రేక్షకులను భయపెడతానంటోంది త్రిష. మోహిని మూవీ స్టోరీ ప్రకారం.. త్రిష కేరక్టర్ లండన్ వెళుతుంది. చెఫ్ గా అక్కడ పనిచేసేందుకు వెళ్లిన త్రిషను.. ఓ దెయ్యం వెంటాడి వేధిస్తూ ఉంటుంది. ఆ దెయ్యం త్రిషను తెగ టార్చర్ పెడుతూ ఉంటుంది. త్రిష పాత్రను బాధ పెట్టడంలోనే ఆ దెయ్యానికి తెగ ఆనందం ఉంటుందిట. ఇంతకీ అసలు విశేషం ఏంటంటే.. త్రిష రోల్ ను వెంటాడే దెయ్యం రోల్ ను కూడా త్రిషనే చెసింది.
ఇలా బాధపడే పాత్రలోను.. బాధ పెట్టే దెయ్యం రోల్ లోను.. రెండు పాత్రల్లో త్రిష మెప్పించేసిందని అంటున్నారు మేకర్స్. త్రిష వర్సెస్ త్రిష వచ్చే సీన్స్ ప్రేక్షకులను తెగ అలరించేస్తాయని నమ్మకంగా ఉంది. దాదాపు లండన్ లోనే మూవీ మొత్తం షూటింగ్ జరపగా.. త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నామని చెప్పాడు దర్శకుడు మాదేష్.