Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 15:19:05
facebook Twitter Googleplus
Photo

వెస్టిండీస్ వాళ్లకు ఇండియన్స్ తో ఉన్న కనెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాలకు క్రికెట్ పరంగా కూడా మంచి సంబంధాలున్నాయి. ఆ దేశ క్రికెటర్లను మన వాళ్లు ఎంతగానో ఆరాధిస్తారు. ఐపీఎల్ లో గేల్.. సామి.. నరైన్.. డ్వేన్ బ్రావో.. పొలార్డ్.. రసెల్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. వీరిలో డ్వేన్ బ్రావో అయితే ఇండియాతో ఎంతో మమేకం అయిపోయాడు. ఇండియన్ మ్యూజిక్ లవర్స్ ను దృష్టిలో ఉంచుకుని మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశాడు. అతను హిందీ సినిమాల్లో నటించాలని కూడా తహతహలాడుతున్నాడు.

ఇప్పుడు బ్రావో బాటలోనే రసెల్ కూడా నడుస్తున్నాడు. అతను ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని మ్యూజిక్ వీడియో ఆల్బమ్ చేయబోతున్నాడు. జస్టిన్ బీబర్ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఆల్బమ్ 'సారీ' కి ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న సంస్థనే రస్సెల్ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బంతో ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కు చేరువై.. ఆ తర్వాత బాలీవుడ్లోనూ అడుగుపెట్టాలని రసెల్ ఆశపడుతున్నాడు. తాను లాంచ్ చేయబోయే తొలి ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోను ఎక్కువగా ఇండియాను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నామని.. ఆ తరువాత కుదిరితే తాను బాలీవుడ్లో కూడా నటిస్తానేమో అని రసెల్ అన్నాడు. డోప్ పరీక్షలకు సంబంధించి సమయానికి వివరాలు ఇవ్వనందుకు యాంటీ డోపింగ్ ఏజెన్సీ రసెల్ పై ఏడాది నిషేధం విధించింది. దీంతో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కూడా ఆడట్లేదు

,  ,  ,  ,  ,