Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:32:08
facebook Twitter Googleplus
Photo

ఓ అండర్ స్టాండింగ్ ప్రకారమే మే 6వ తేదీని ?అ..ఆ? టీమ్ ?24? హీరో కమ్ ప్రొడ్యూసర్ సూర్యకు ధారాదత్తం చేసిందో లేదో తెలియదు కానీ.. ఆ డేటును వదిలేయడం ఇప్పుడు వాళ్లకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ డేటు వదిలేయడం వల్ల మేలో మరే వారమూ ఖాళీ దొరక్క ఇబ్బంది పడుతోంది ?అ..ఆ? టీమ్. మే 6న ?24? వచ్చిన వారానికే మహేష్ బాబు సినిమా ?బ్రహ్మోత్సవం? విడుదల కాబోతోంది. మహేష్ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి ఎలా ఉంటుందో తెలిసిందే. కాబట్టి తర్వాతి వారం ?అ..ఆ?ను విడుదల చేయడానికి లేదు. ఒకవేళ ?బ్రహ్మోత్సవం?కు కొంచెం డివైడ్ టాక్ వస్తే.. తర్వాతి వారం తన సినిమా ?సుప్రీమ్?ను రిలీజ్ చేసేద్దామని కాచుకుని ఉన్నాడు దిల్ రాజు. ?బ్రహ్మోత్సవం? కాకుండా మిగిలే మెజారిటీ థియేటర్లను దిల్ రాజే దక్కించుకుంటాడనడంలో సందేహం లేదు. ఆయనకు అంత పట్టుంది మరి.

ఇక అది కాదంటే మే 27న ?అ..ఆ?ను రిలీజ్ చేయాలి. ఐతే అన్నీ కుదిరితే ఆ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ?కబాలి? రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. స్వయంగా రజినీకే వాటిని ఖండించాడు. మే 27నే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని.. కుదరకపోతే వారం వెనక్కి వెళ్తామని అన్నాడు. ఇప్పటికే రజినీ డబ్బింగ్ కూడా మొదలుపెట్టేయడాన్ని బట్టి సినిమా అనుకున్న ప్రకారమే విడుదలయ్యేలా కనిపిస్తోంది. అదే జరిగితే.. క్యాలెండర్ ఇయర్లో సినిమాలకు బెస్ట్ మంత్ అనదగ్గ మేను ?అ..ఆ? టీమ్ వదులుకోక తప్పదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాను అనుకున్న ప్రకారం మే 6న విడుదల చేసేస్తే పోయేది. ఇప్పుడు ఆల్టర్నేట్ డేట్ దొరక్క తల పట్టుకుంటున్నాడట త్రివిక్రమ్. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. ఈ నెల 26న ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,