Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2015 12:39:00
facebook Twitter Googleplus
Photo

సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమా ఏమిటన్న దానిపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన నితిన్ తో సినిమా చేయనున్నట్టు రెండు రోజుల క్రితమే ఓ వార్త వచ్చింది. అయితే, అంతలోనే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నాడట! ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ దీనిని నిర్మిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో వెలువడుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే కనుక, ఇటీవల అపజయాలతో సతమతమవుతున్న నాగచైతన్య ఈ సినిమాతో గాడిలో పడతాడనే చెప్పచ్చు!

,  ,  ,