Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 12:48:21
facebook Twitter Googleplus
Photo

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ పూజ హెగ్డే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కోలీవుడ్ - బాలీవుడ్ లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎందులోను సరైన హిట్స్ అందుకోలేదు. ఫైనల్ గా దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో స్టయిలిష్ స్టార్ తో రొమాన్స్ చేసి పరవాలేదు అనిపించుకుంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా బికినీలో సందడి చేసిన అమ్మడికి ఆఫర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

తన అందంతోనే ఈ డస్కీ పిల్ల అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కొంచెం హై బడ్జెట్ లోనే తెరకెక్కుతోంది. ఇక రీసెంట్ గా అమ్మడికి దిల్ రాజు ప్రొడక్షన్ నుండి మరో అఫర్ దక్కింది. దిల్ రాజు ఇంతకుముందు డీజే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నితిన్ తో నిర్మించబోయే 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో కూడా ఈ టాప్ ప్రొడ్యూసర్ మళ్లీ పూజా హెగ్డే ని సెలెక్ట్ చేశాడు.

శతమానం భవతి సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న సినిమాను తెరకెకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాత ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో అన్ని పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తేవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,