ఇప్పుడు అ..ఆ సినిమా కోసం కూడా బీభత్సమైన ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ల కారణంగా సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం సినిమాలకు ఓవర్ హైప్ వచ్చేసింది. దానితో తొలిరోజే సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఎంత హైప్ పెరిగితే అంత బ్యాడ్ అన్నట్లుంది పరిస్థితి. ఇప్పుడు ''అ..ఆ'' వంతొచ్చింది మరి.
నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ తాలూకు ఇంటర్యూలు.. స్వయంగా త్రివిక్రమ్ డిజైన్ చేశాడట. చాలా హ్యూమరస్ గా ఉండేలా.. తనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి.. తానే ఆన్సర్లు కూడా రాసిచ్చాడట. అయితే తను చెప్పిన ఆన్సర్లు ఏంటో మాట్లాడే నటుడికి తప్పించి పక్కవారికి తెలియవు. ఈ ప్రమోషనల్ ఇంటర్యూలను గత రెండు రోజులుగా నితిన్ - సమంత - అనుపమా పరమేశ్వరన్ - రావు రమేష్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. నేడో రేపో టివిల్లో వెబ్ లలో రిలీజ్ చేస్తారట. ఈ ఇంటర్యూలు కూడా సినిమా లెవెల్లో ఉంటాయ్ అనే టాక్ వినడానికి బాగానే ఉంది కాని.. అసలు అలా ఉంటేనే అసలు ప్రాబ్లమ్ అంతా. సర్దార్ డైరీస్.. బ్రహ్మోత్సవం ఇంటరాక్షన్స్.. ఇంకా మర్చిపోలేదు బాబూ ప్రేక్షకులు. అందుకే హైప్ పెంచకుండా ఉంటే అ..ఆ టీమ్ కే మంచిది.
ఇకపోతే సినిమా రిజల్టు మీద దర్శకుడు త్రివిక్రమ్.. అతని టీమ్.. చాలా కాన్ఫిడెంటుగా ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2న సినిమా రిలీజవుతోంది.