Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-May-2016 12:50:54
facebook Twitter Googleplus
Photo

ఈ సమ్మర్లో ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయింది సమంత. అందులో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజైపోయాయి. ఆ రెండూ కూడా హిట్లే. ?తెరి? డివైడ్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్టయిపోగా.. ?24? చాలా మంచి టాక్ తో మొదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ రేంజికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే సమస్య ఏంటంటే.. 24 సక్సెస్ ను సమంత ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేదు. ?24? గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. విక్రమ్ డైరెక్షన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో కమ్ ప్రొడ్యూసర్ సూర్యను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంకా టెక్నీషియన్స్ అందరినీ పొగుడుతున్నారు.

కానీ ఈ సినిమా విషయంలో నెగెటివ్గా మాట్లాడుతోంది ఒక్క సమంత గురించి మాత్రమే. ఆమె పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల గురించే జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. రొమాంటిక్ ట్రాక్ కొంచెం సోదిలా ఉందని.. ముఖ్యంగా ద్వితీయార్దంలో సమంత ఉన్న సన్నివేశాలన్నీ వేస్ట్ అని అంటున్నారు. ఆమె నటన.. గ్లామర్ విషయంలోనూ నెగెటివ్ కామెంట్లే పడుతున్నాయి. దీంతో ఇంకో హిట్టు కొట్టామన్న సమంత సంతోషాన్ని.. తన పాత్ర గురించి నెగెటివ్ కామెంట్లు పడుతున్న బాధ డామినేట్ చేస్తోంది పాపం. అయినా ఈ విషయంలో సమంత తప్పేమీ లేదు కదా. దర్శకుడు చెప్పినట్లు ఆమె చేసింది. కాబట్టి ప్రశంసలన్నీ దర్శకుడి ఖాతాలోకి వేసి.. విమర్శలు సమంత మీదికి నెట్టేయడం కరెక్ట్ కాదు.

,  ,  ,  ,  ,  ,  ,  ,