Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 10:54:40
facebook Twitter Googleplus
Photo

జులాయికి ముందు రెండు సినిమాలకు నిర్మాతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి టైంలో హారిక హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణతో ఆయనకు ఈక్వేషన్ బాగా కుదిరింది. దీంతో వరుసగా జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అఆ సినిమాలు ఆ బేనర్లోనే చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను.. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను కూడా ఆ బేనర్లోనే చేయబోతున్నాడు త్రివిక్రమ్. చూస్తుంటే ఇక వేరే బేనర్లో త్రివిక్రమ్ సినిమా చేయడమే సందేహంగా కనిపిస్తోంది. ఈ సంస్థలో చేసే సినిమాలకు త్రివిక్రమ్ పారితోషకం తీసుకోడని.. వాటా తీసుకుంటాడని.. ఒకరకంగా అతను అనధికారిక నిర్మాణ భాగస్వామి అని అంటారు సన్నిహితులు.

ఐతే హారిక హాసిని బేనర్ సినిమాలకు సంబంధించి నిర్మాతగా త్రివిక్రమ్ పేరు పడకపోయినప్పటికీ.. ఈ బేనర్ కు అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మాత్రం త్రివిక్రమ్ పేరును వాడుకోబోతున్నట్లు సమాచారం. నందిని రెడ్డి దర్శకత్వంలో సితార బేనర్లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడట. ఇలా త్రివిక్రమ్ పేరు ప్రొడక్షన్లో కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది. పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా నందిని ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్-2 పేరుతో చిన్న సినిమాలు చేసినట్లే.. హారిక హాసిని వాళ్లు కూడా సితార మీద వరుసగా చిన్న సినిమాలు చేస్తారట. మరి ప్రతి సినిమాకూ ఇలాగే త్రివిక్రమ్ సమర్పించు.. అని పడుతుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,