Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2017 13:35:19
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాను పూర్తి చేసేస్తున్నాడు. జనవరి 10న రిలీజ్.. ఆ తర్వాత ఓ వారం ప్రమోషన్స్ తో పవన్ మూవీ వర్క్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అనే మాట వినిపిస్తోంది.

కానీ హీరో.. హీరోయిన్స్ ఎంపికలో త్రివిక్రమ్ ముందు నుంచి ఓ ఫార్మాట్ ఫాలో అవుతున్నాడు. రీసెంట్ గా నితిన్ తో సినిమా చేయడం మినహాయిస్తే.. గతంలో ఈయన సినిమా అంటే.. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్.. వీరితో మాత్రమే మార్చి మార్చి సినిమాలు చేసేవాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. ఒక హీరోతో చేసిన హీరోయిన్ ని.. తర్వాతి మూవీలో మరో హీరోతో రిపీట్ చేయడం జరిగేది. జల్సాలో పవన్ పక్కన నటించిన ఇలియానాను.. జులాయిలో బన్నీతో నటింపచేయడం.. అత్తారింటికి దారేదిలో పవన్ తో చేసిన సమంతను.. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి.. అఆలో నితిన్ పక్కన హీరోయిన్ గా తీసుకోవడం జరిగేది.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో హీరో-హీరోయిన్ జంట ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. గతంలో కనిపించని కాంబినేషన్ ను సెట్ చేయడం ఈయనకు అలవాటు. అదే ఇప్పుడు రకుల్ కు అడ్డంకి అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ తో రకుల్ జత కట్టింది. కానీ త్రివిక్రమ్ ఫార్మాట్ ప్రకారం అయితే.. ఇప్పుడు పవన్ మూవీలో నటిస్తున్న కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ లలో ఒకరిని ఎన్టీఆర్ చిత్రంలోకి తీసుకోవాలి.

,  ,  ,  ,