Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:08:22
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ కాటమరాయుడు షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరోవైపు తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ప్రారంభోత్సవం జరిపించేశాడు. ఇప్పుడేమో త్రివిక్రమ్తో సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టేశాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుంది.. ఏది ఎప్పుడు పూర్తవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అన్న సందిగ్ధత ఉంది జనాల్లో. ఐతే తాజా సమాచారం ప్రకారం టీఎన్ నీశన్ దర్శకత్వంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలు కాదట. ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లేది వచ్చే ఏడాది సమ్మర్లోనే. వచ్చే నెల నుంచి ?కాటమరాయుడు?తో సమాంతరంగా త్రివిక్రమ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ ఏడాది ఆఖర్లో ?కాటమరాయుడు? పూర్తి చేయబోతున్న పవన్.. ఆ తర్వాత నిర్విరామంగా త్రివిక్రమ్ సినిమాకే పని చేస్తాడు. ఈ చిత్రం సగానికి పైగా పూర్తయ్యాక.. నీశన్ సినిమాను కూడా మొదలుపెడతాడు. త్రివిక్రమ్ సినిమా జూన్ - జులై నెలలకు పూర్తి కావచ్చని సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ మీద కూడా ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది ఆగస్టు 15కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. మధ్యలో ఈ ప్రణాళికల్లో ఏమైనా మార్పులు రావచ్చేమో. ?కాటమరాయుడు? మార్చి నెలాఖరులో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నీశన్ సినిమా కూడా వచ్చే ఏడాదే పూర్తయి.. ఇయర్ ఎండింగ్ లో విడుదల కావచ్చని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఏడాది పవన్ అభిమానులకు ట్రిపుల్ ధమాకానే అన్నమాట.

,  ,  ,  ,  ,  ,