Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2017 15:53:41
facebook Twitter Googleplus
Photo

బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించిన తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ.. ఆ తర్వాత బేతాళుడు.. యమన్ సినిమాలతో నిరాశ పరిచాడు. దీంతో తెలుగు ప్రేక్షకులు అతణ్ని మరిచిపోయారు. ఐతే విజయ్ ఆంటోనీ కొంత విరామం తర్వాత మళ్లీ లైన్లోకి వచ్చాడు. అతను కథానాయకుడిగా ఇంద్రసేన అనే సినిమా తెరకెక్కింది. సీనియర్ నటి రాధిక నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. విజయ్ ఆంటోనీ సహ నిర్మాత. శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని నిరూపించాడు. తమిళంలో అన్నాదురై పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ ఇంద్ర ను తలపించేలా ఇంద్రసేన అనే టైటిల్ పెట్టడం విశేషం.

అంతే కాదు.. మెగాస్టార్ చేతుల మీదుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తనకు ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడిగా ఉన్న విజయ్ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడని.. ఈ చిత్రానికి విజయ్ సంగీతం అందించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండటం గొప్ప విషయమని.. అతడి ప్రయత్నం సక్సెస్ కావాలని చిరు అన్నాడు. ఇంద్రసేన లో విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

,  ,  ,  ,  ,  ,