Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 11:58:27
facebook Twitter Googleplus
Photo

తొలి సినిమానే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో చేసిన మైత్రీ మూవీస్ సంస్థ.. తమ రెండో సినిమాకు మరో స్టార్ హీరో ఎన్టీఆర్ ను ఎంచుకుంది. మూడో సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కమిట్ చేయించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ సినిమా కోసం పవన్ మిత్రుడు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు సైతం అడ్వాన్స్ ఇచ్చింది. ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులూ కలిసి మైత్రీ మూవీస్ కు షాకిచ్చినట్లు సమాచారం.

మైత్రీ సంస్థ తమకిచ్చిన అడ్వాన్సుల్ని పవన్.. త్రివిక్రమ్ ఇద్దరూ ఇటీవలే తిరిగిచ్చేశారట. దీనికి కారణాలేంటన్నది తెలియలేదు కానీ.. ఈ సంగతి మాత్రం వాస్తవమని మైత్రీ మూవీస్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ తన తర్వాతి ప్రాజెక్టుల గురించి చెబుతూ.. త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

మైత్రీ వాళ్లకు టాటా చెప్పేశారు కాబట్టి ఈ సినిమాను మరో నిర్మాత ఎవరో టేకప్ చేస్తారన్నమాటే. తాను కమిట్మెంట్ ఇచ్చిన రామ్ చరణ్.. దాసరిల్లో ఒకరికి ఛాన్సిస్తాడేమో పవన్. త్రివిక్రమ్ సినిమా కాకుండా ఎస్.జె.సూర్యతోనూ పవన్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత రాజా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా లైన్లో పెట్టాడు పవన్.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,