Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 13:03:05
facebook Twitter Googleplus
Photo

బూతుతో కామెడీ చేయడం చాలా ఈజీ అని.. కానీ తన పద్ధతి అది కాదని అన్నాడు త్రివిక్రమ్. మొదట్నుంచి తాను క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నానని.. ?అఆ? వరకు ఈ విషయంలో మరింత మనసుపెట్టి చేశానని త్రివిక్రమ్ అన్నాడు. గుంటూరులో జరిగిన ?అఆ? విజయోత్సవంలో మాట్లాడుతూ త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ?అఆ? కథ ఎలా పుట్టింది.. ఎందుకు పుట్టింది అనే విషయాల్ని త్రివిక్రమ్ ఈ వేడుకలో వివరించాడు.

??అఆ చేయాలనుకున్నపుడు ఒక మామూలు కథలు చెప్పాలి.. దాన్నే బలంగా చెప్పాలి.. ఎక్కువ మలుపులొద్దు.. ఎమోషనల్ హైస్ వద్దు.. ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు.. క్లైమాక్స్ లో రక్తపాతాలొద్దు.. అనుకున్నా. మనింట్లో డ్రాయింగ్ రూంలో మనవాళ్లతో మాట్లాడుకుంటాం.. గొడవ పడతాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇలాంటి విషయాలే సినిమాలో ఎందుకు చూపించకూడదు అని ఈ కథ రాశా. నేను దర్శకుడు కావడానికి ముందు రచయితను. త్రివిక్రమ్ కంటే ముందు మామూలు శ్రీనివాసుని. మామూలు కుటుంబంలో పుట్టాను.

నా దృష్టిలో మనిషి గొప్పవాడు. ఒక మనిషికి మంచి ఆలోచనలుంటే మంచి స్థితికి వెళ్తాడు. మనం సరైన గాలి పీలిస్తే 98 శాతం జబ్బులు రావు. కానీ మనం ఉచితంగా దొరికే మంచి గాలి పీల్చడం మానేసి.. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. పది రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనం. కానీ 60 రూపాయలు పెట్టి బీర్ కొని తాగి పాడైపోతుంటాం. అసలు మనం మనుషులతో మాట్లాడ్డమే మానేశాం. గొప్ప గొప్ప పనులు చేస్తేనే బాగుంటాం అనుకుంటారు. కానీ ప్రపంచం బాగుండాలంటే ఏమీ చేయనక్కర్లేదు. ఇద్దరు వ్యక్తులు పక్క పక్కన కూర్చుని కళ్లల్లో కళ్లు పెట్టుకుని చూస్తూ మాట్లాడుకుంటే చాలు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పడానికే ?అఆ? తీశాను.

వికలాంగుల మీద.. కులం మీద.. మతం మీద.. లోపాల మీద జోకులేయకుండా వీలున్నంత వరకు మన మధ్య జరిగే విషయాలతో.. మాటలతోనే వినోదం పండించాలనుకున్నా. అసలు నా ప్రయాణమే అది. అందుకోసమే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. బూతు మాట్లాడి నవ్వించడం తేలిక. కానీ నవ్విన వెంటనే మనల్ని తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట చెబితే అప్పటికి అర్థం కాకపోయినా.. తర్వాత దాని గురించి ఆలోచించి బాగుందనిపిస్తే ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. అందుకే లేటైనా పర్వాలేదు మంచిదే చెబుదామనిపిస్తుంది. మనం మసాలాలు చెత్తా చెదారం తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే చారు అన్నం.. మజ్జిగతో తినమంటారు. నా దృష్టిలో అలాంటి చారు అన్నమే ?అఆ? సినిమా కూడా. కాకపోతే కొంచెం నెయ్యి కలిపి ఉంటుంది. ఎక్కువ కారం.. పులుపు.. తీపి.. ఉప్పు ఉండవు. కొందరికి ఇందులో ఏముంది చాలా సింపుల్ అని కూడా అనిపించొచ్చు?? అని త్రివిక్రమ్ అన్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,