Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2015 13:45:21
facebook Twitter Googleplus
Photo

భీమవరం బుల్లోడు - ఆంధ్రాయూనివర్శిటీ స్టూడెంటు పోసానికి అసిస్టెంటు అవుతాడని ఆ తర్వాత రచయితగా ఎదుగుతాడని దర్శకుడై సంచలనాలు సృష్టిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఊహించనిది జరగడమే విధి. అందుకే త్రివిక్రముడు మాటల మాంత్రికుడయ్యాడు. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కృష్ణవంశీ ?సముద్రం?కి అసోసియేట్ గా చేరి డెరైక్షన్ నేర్చు కుంటూ ?చిరునవ్వుతో? కథ రాసి అది రామ్ ప్రసాద్ గారి దర్శకత్వంలో సూపర్హిట్టయ్యాక ?నువ్వే కావాలి - నువ్వు నాకు నచ్చావ్ - మన్మథుడు - మల్లీశ్వరి? వరకూ అప్రతిహతంగా స్టార్ రైటర్ స్టాటస్ ని మెయింటెయిన్ చేశాడు త్రివిక్రమ్.

?నువ్వే నువ్వే?తో దర్శకుడయ్యాడు. ఏడెనిమిది వేల రేంజ్ లో రెండు జతల చెప్పులు కొనుక్కున్న మొదటి సందర్భం అదే.అంతా ఖర్చు చేసేస్తే నెలంగా గడవడం ఎలా సార్? అన్నవాడు.. ఇవ్వాళ ఖర్చు పెట్టేద్దాం! ముందు మనం మన కిష్టమైంది చేశామనుకోండి... మంచి థాట్స్ అవే వస్తాయి? అని ఆ అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత అనగానే.. ఓహో జ్ఞానోదయం అంటే ఇదేనేమో.. అనుకున్నాడే కానీ దానిని కూడా నెగెటివ్ గా ఆలోచించలేదు.

?ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి? అనుకునే టైపు కాదు. ఏ ఎత్తులో ఉంటే ఆ ఎత్తులో నుంచి ప్రపంచాన్ని చూడాలి అనుకునే టైపు. పక్కాగా మోడ్రన్. ?సిరివెన్నెల? సీతారామశాస్త్రి గారింట్లో త్రివిక్రమ్ కీ శాస్త్రి గారి తమ్ముడి కూతురికీ నిశ్చితార్థం. ఈయన పీటల మీద కూర్చొని ఉన్నారు. పెళ్ళి కూతురింకా రాలేదు. నన్ను చూడగానే - పీటల మీద నుంచి లేచొచ్చి ?మీతో అర్జంట్ గా మాట్లాడా?లని నన్ను కారులో అన్నపూర్ణా స్టూడియో రోడ్డు చుట్టూ రౌండ్లు కొట్టించి నాకు క్లాసు పీకారు. అది కూడా తనకు సంబంధించిన విషయం కాదు. నా కోసం... నా కెరీర్ కోసం!

?పోసాని గారి కథ చిరంజీవి గారు బావుందంటే మీరు బాలేదన్నారట! మీకెందుకు? మెగాస్టార్ ఒప్పుకున్న కథను బాలేదని మీకు వచ్చిన అంత మంచి డెరైక్షన్ అవకాశం పోగొట్టుకోకండి. ఒప్పుకొని ఎలా బాగుచేయాలో ఆలోచించండి. చిరంజీవి గారితో సినిమా చేయాలని మనందరి డ్రీమ్ కదా! మీకు ఆ ఛాన్స్ ముందు వస్తే మీరెలా వదులుకుంటారు? అని నాకు పదే పదే చెప్పారు. ?మీరు రాస్తారా మాటలు. ఇప్పుడే వెళ్ళి ఒప్పేసుకుంటా? అన్నాను. నన్ను మూర్ఖంగా ఆలోచించవద్దని చాలా చెప్పారు. ఆ టైమ్ లో నాకు అలా చెప్పడం ఆయనకు అవసరం లేదు. అయినా హితబోధ చేశారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్క్ హయత్ హోటల్ లో ఓ రెండు గంటలు గడిపాను. అదే త్రివిక్రమ్. మేము కూర్చున్న స్థలం మారింది కానీ మనిషి మారలేదు! ఆతడి మమత తీరలేదు!!.... ఇది చెప్పుకొచ్చింది త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ వి.ఎన్.ఆదిత్య.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...

,  ,  ,