Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:59:12
facebook Twitter Googleplus
Photo

అప్పుడెప్పుడో గతేడాది మొదట్లో షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా. ఎట్టకేలకు ఈ దీపావళి సమయానికి థియేటర్లలోకి తెస్తున్నారు. గోపీచంద్ నటించిన ఈ చిత్రం విడుదలపై ఇంకా కొన్ని అనుమానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనికి ముందు సంపత్ నంది లాంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రమే ఆఖరి నిమిషంలో వెలుగులు చూసేందుకు కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి.

అయితే.. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఆక్సిజన్ మూవీపై పాజిటివ్ బజ్ బాగానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే.. గోపీచంద్ కి మళ్లీ కరెక్ట్ మూవీ పడినట్లు అనిపిస్తోందనే టాక్ వచ్చింది. అయినా.. ఆక్సిజన్ సినిమాను అంతగా ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే ఆడియో ఆల్బమ్ కూడా కిక్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతోంది. ఒకటొకటిగా విడుదల చేస్తున్న పాటలు.. సోసోగా ఉంటున్నాయంతే. కాని ఈ పాటలకు మాత్రం మలయాళ కుట్టి అను ఎమ్మానుయేల్ భారీ అట్రాక్షన్ అయిపోతోంది. ఆమె అందాలను చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

గతంలో నాని హీరోగా మజ్ను మూవీలో అను ఎమ్మాన్యుయేల్ కనిపించింది. అయితే.. ఆ మూవీలో మరీ పద్ధతిగా ఉంటుంది ఈ బ్యూటీ. కానీ ఆక్సిజన్ మూవీలో మాత్రం స్టైల్ మార్చేసిందనే సంగతి కనిపిస్తోంది. క్లీవేజ్ అందాలతో సహా బాగానే ఆన్ స్క్రీన్ పై ధారపోసింది.

,  ,  ,  ,  ,