Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 12:12:39
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీగా ఎన్నో సబ్జెక్టులు విని.. చివరకు కోలీవుడ్ కత్తిని కన్ఫాం చేసి.. ఖైదీ నెంబర్ 150గా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేయడమే కాదు.. జనవరి 11న రిలీజ్ అయిపోనుంది కూడా. మరి ఆ తర్వాత చిరు ఏం చేస్తారు? తనకు పాలిటిక్స్ కంటే సినిమాలే కంఫర్టబుల్ అని.. ఇకపై కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చిరు స్వయంగా చెప్పేశారు కూడా.

మరి చిరంజీవి 151వ సినిమా సంగతేంటి అంటే.. ఇప్పటికే దర్శకుడి రేసులో బోయపాటి శ్రీను పేరు వినిపిస్తోంది. అయితే.. ఇంకా అనౌన్స్ కాలేదు కానీ.. రీసెంట్ గా మెగాస్టార్ మాటల మాటల మాంత్రికుడు సుదీర్ఘంగా డిస్కషన్స్ చేయడం కొత్త అంచనాలకు తావిచ్చింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. చిరు-త్రివిక్రమ్ మూవీ ఖాయమైందని అంటున్నారు. కాకపోతే.. త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనుండడంతో.. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేస్తారట త్రివిక్రమ్.

ఈలోగా చిరు కూడా ఓ మూవీ కంప్లీట్ చేయనున్నారని టాక్. అంటే మెగాస్టార్ నటించే 152వ సినిమా త్రివిక్రమ్ తోనే అని తెలుస్తోంది. ఈ మూవీని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ స్వయంగా నిర్మించాలని నిర్ణయించారట. చిరు-త్రివిక్రమ్-పవన్.. వినడానికే కాంబినేషన్ కేకలు పెట్టిస్తోంది. ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే మాత్రం.. మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ.

,  ,  ,  ,  ,