Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 16:29:53
facebook Twitter Googleplus
Photo

రిలీజ్ డేట్ దగ్గర పడ్తోంది. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఏర్పాట్లు కూడా చకచకా అయిపోతున్నాయ్. పాటలైతే యూట్యూబ్ లో కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాయ్. అంతా ఓకే కానీ మరి మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఔట్ పుట్ ఎలా ఉంది..? అద్భుత:హా అని పాజిటివ్ గా.. కాదు కాదు ఎక్కడో తేడా కొడుతుందని నెగటివ్ గా ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయ్... జరుగుతున్నాయ్. ఇందులో ఏవీ నిజాలో అర్థం కాక.. ఎలా రియాక్ట్ అవాలో తెలీయక ఫ్యాన్స్ కంగారు పడ్తున్నారు.

అయితే ఇక మీదట మెగాఫ్యాన్సంతా రిలాక్స్ గా ఉండొచ్చేమో. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 ఔట్ పుట్ అదిరిపోయిందని చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోందిప్పుడు. చిరంజీవి కమ్ బ్యాక్ పర్ఫెక్ట్ మూవీతో జరగబోతుందని.. మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ చిరును ఎలా చూపిస్తే ఆడియెన్స్ కి కిక్ వస్తుందో అలాగే చూపించారని.. మూవీలో అన్ని హంగులు ఉండేలా చూసుకొన్నాడని.. ఎక్కడా రాజీ పడలేదంటున్నారు. చిరు స్క్రీన్ ప్రెజెన్స్.. పోసాని పంచ్ డైలాగ్స్.. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్.. బ్రహ్మీ కామెడీ.. దేవీ మ్యూజిక్ కలిసి ఖైదీ నెంబర్ 150ని పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ మూవీగా మార్చాయంటున్నారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ వదులుతున్న కొత్త కొత్త పోస్టర్స్ చూసి ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. పూటకోకటి ఇచ్చే బదులు అన్నీ ఒకేసారి వదలొచ్చుగా అని సోషల్ మీడియాలో ఓపెన్ గానే పోస్ట్ లు పెడుతున్నారు. ముఖ్యంగా 3 సాంగ్స్ అండ్ 3 ఫైట్స్ సీక్వెన్స్ వచ్చినప్పుడు చించడానికి 30 బస్తాల పేపర్లు సరిపోవనే రిలయబుల్ టాక్ ఎక్కడలేని జోష్ ఇస్తోంది. ఇక్కడ అభిమానులు రెడీ.. మరి పదకొండో తారీఖు రావడమే ఇక ఆలస్యం. 11నే రిలీజ్ అనేది కూడా జస్ట్ కన్ఫామ్ అయ్యింది.

,  ,  ,  ,  ,  ,