Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 15:52:09
facebook Twitter Googleplus
Photo

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. మున్ముందు నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయేలా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన నితిన్-కృష్ణచైతన్య సినిమాను పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ నిర్మాతగా మరో రెండు సినిమాలకు రంగం సిద్ధమవుతోంది. ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద సినిమాల తర్వాత అవసరాల శ్రీనివాస్.. నానితో ఓ సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి నిర్మాత ఎవరో ఇంకా ఖరారు కాలేదు.

ఐతే త్రివిక్రమే ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంకా స్క్రిప్టు సిద్దం కాకపోయినప్పటికీ అవసరాల మీద ఉన్న భరోసాతో పెట్టుబడి పెట్టడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పెళ్లిచూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా నందిని రెడ్డి తీయబోయే సినిమాను కూడా తనే నిర్మించనున్నాడు.

యంగ్ డైరెక్టర్స్ కొత్త ఆలోచనలతో వస్తే త్రివిక్రమ్ సినిమాలు తీయడానికి రెడీ అయ్యేలా ఉన్నాడు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకోవాలని చూస్తున్నట్లున్నాడు త్రివిక్రమ్. అతను లైన్లో పెట్టిన ప్రాజెక్టులన్నీ ఆసక్తి రేకెత్తించేవే. మరి ఈ సినిమాలకు త్రివిక్రమ్ పెట్టుబడి సొంతంగా పెడుతున్నాడో లేక ఆయన మిత్రుడైన రాధాకృష్ణ (హారిక హాసిన క్రియేషన్స్ అధినేత) పెడుతున్నాడో.

,  ,  ,  ,  ,  ,  ,