Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2017 10:30:34
facebook Twitter Googleplus
Photo

జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో కూడా చాలా ఫ్యామస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ ని అందరూ గుర్తుపడుతున్నారు. అయితే ప్రభాస్ ఇంత స్టార్ డమ్ ని అస్సలు మెయింటైన్ చేయలేకపోతున్నానని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రభాస్ ఒకవేళ స్టార్ అవ్వకపోతే తనకు ఒక ఆలోచన ఉండేదని చెబుతున్నాడు. స్టడీస్ లో నేను చాలా పూర్.. నాకు ఏ ఉద్యోగం కూడా వచ్చేది కాదు. ఒకవేళ నేను సినిమాల్లోకి అడుగుపెట్టకుంటే అందరికి మంచి రుచిని చూపించే స్టార్ హోటల్ బిజినెస్ లోకి వెళ్లేవాన్ని అని ప్రభాస్ తెలిపాడు. అయితే భక్త కన్నప్ప సినిమా చూసిన తర్వాత నటన మీద ఆసక్తి కలిగిందని ఒక నటుడు మరియు టెక్నీషియన్ కలిసి చేస్తే ప్రేక్షకులని చాలా థ్రిల్ చేయవచ్చని తెలుసుకొని సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు ప్రభాస్ చెప్పాడు.

ఈ మధ్య తనను తాను చాలా మార్చుకుంటున్నట్లు ప్రభాస్ చెప్పాడు. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు అందరిని కలవడానికి ఇష్టపడుతున్నట్లు... అలాగే అభిమానులతో కూడా ఎక్కువగా టచ్ లో ఉంటానని తెలిపాడు. రీసెంట్ గా చాలామంది అభిమానులను కలిసినట్లు ప్రభాస్ తెలిపాడు.

,  ,  ,  ,  ,