Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Feb-2016 13:25:53
facebook Twitter Googleplus
Photo

"గుండెల్లో గోదారి" ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం "తుంటరి". రోహిత్ సరసన లతా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకీర్తి ఫిలింస్ పతాకంపై అశోక్ బాబా మరియు నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీత సారధ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన పాటలకు విశేషమైన స్పందన లభించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా "తుంటరి" చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు కుమార్ నాగేంద్ర మాట్లాడుతూ.. "ఇటీవల విడుదలైన ఆడియోతోపాటు ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. తుంటరి కుర్రాడిగా నారా రోహిత్ నటన, డైలాగ్ డిక్షన్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. మా సినిమా ట్యాగ్ లైన్ "డెస్టినీ వెర్సస్ హార్డ్ వర్క్" మా చిత్ర విజయానికి ఉదాహరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మార్చి 11న "తుంటరి"గా నారా రోహిత్ సోలోగా ఆకట్టుకోలున్నాడు" అన్నారు.
కబీర్ సింగ్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుదర్శన్, అలీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, నిర్మాణం: శ్రీ కీర్తి ఫిలింస్, నిర్మాతలు: అశోక్ బాబా-నాగార్జున, కథ: ఎ.ఆర్.మురుగదాస్, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర!

,  ,  ,  ,  ,