Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 11:14:51
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో సీక్వెల్ 2.0లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ఇప్పుడీ మూవీలో ఉండే ఒకే ఒక పాటను చెన్నైలో షూట్ చేస్తున్నారు. రజినీకాంత్- అమీ జాక్సన్ ల మధ్య ఈ పాట సాగనుంది.

అదేంటీ రజినీ-అమీల సాంగ్ ఉక్రెయిన్ లో కదా షూటింగ్.. ఇప్పుడు చెన్నైలో అంటారేంటీ అనుకోవచ్చు. ఈ పాటను అక్కడే షూట్ చేయాలని భావించిన మాట నిజమే కానీ.. రజినీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఆ సాహసం చేయలేకపోయాడు దర్శకుడు శంకర్. అక్కడ మైనస్ డిగ్రీల్లో కూడా చలి నమోదవుతూ ఉంటుంది. అందుకే రజినీని ఉక్రెయిన్ తీసుకెళ్లే బదులు.. ఉక్రెయిన్ నే ఇండియాకి పట్టుకొచ్చేస్తున్నారు. గత నెలలోనే ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను ఫోటోల రూపంలో తీసుకొచ్చిన 2.0 యూనిట్.. ఇప్పుడు అదే ప్రాంతాన్ని చెన్నైలో సెట్స్ రూపంలో వేసేస్తున్నారు.

కొంత సెట్స్.. మరికొంత గ్రాఫిక్స్.. అంతా మిక్స్ చేస్తే ఉక్రెయిన్ లోనే షూట్ చేశారనే ఫీలింగ్.. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ శంకర్ కు కొట్టిన పిండే కాబట్టి.. స్క్రీన్ పై కనిపించేది రజినీ కాబట్టి.. ఏదైనా చెల్లిపోతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే.. ఉక్రెయిన్ లో షూట్ జరుపుకుతున్న తొలి ఇండియన్ మూవీ తమదే అంటూ విన్నర్ దర్శకుడు గోపీచంద్ మలినేని గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు.

,  ,  ,  ,  ,