Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 12:57:46
facebook Twitter Googleplus
Photo

రేపటి నుంచి ఎన్టీఆర్ కొత్త సెన్సేషన్ బిగిన్ అవుతుండగా.. బుల్లితెరపై యంగ్ టైగర్ హంగామా చివరి దశకు వచ్చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ షో దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంతగా సెన్సేషన్స్ సృష్టించిన కార్యక్రమాన్ని రీప్లేస్ చేయడం.. ఆ స్లాట్ ను వేరే ప్రోగ్రామ్ తో భర్తీ చేయడం.. ఏ ఛానల్ నిర్వాహకులకు అయినా చాలా కష్టమైన విషయం. స్టార్ మా ఇప్పుడు ఆ ఏర్పాట్లలోనే ఉంది.

బిగ్ బాస్ ప్లేసులో ఓ డ్యాన్స్ షోను ప్రారంభించనుండగా.. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. గత కొన్నేళ్లుగా డ్యాన్సింగ్ షోలకు డిమాండ్ పెరుగుతుండడం.. అల్టిమేట్ ట్యాలెంట్ ను బయటకు తీసుకొచ్చి జనాలకు చూపించే కార్యక్రమాలకు ఆదరణ లభిస్తుండడంతో.. బిగ్ బాస్ స్లాట్ లో డ్యాన్స్ షో టెలికాస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా అందాల భామ ఆదాశర్మను సెలెక్ట్ చేసుకున్నారు. కేవలం హీరోయిన్ అని మాత్రమే ఈమెకు ఈ అవకాశం కల్పించలేదు. ఆదా శర్మ కథక్ నృత్యకారిణి. అంతే కాదు. వెస్ట్రన్ డ్యాన్స్ లో బోలెడంత ట్రైనింగ్ తీసుకుంది కూడా. అందుకే ఈ కార్యక్రమం కోసం ఆదాను సంప్రదించగా.. ఆమె వెంటనే ఒప్పుకుందని తెలుస్తోంది.

ఈ డ్యాన్స్ షోకి మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఒక జడ్జ్ గా వ్యవహరించనుండగా.. జానీ మాస్టర్ మరో న్యాయ నిర్ణేత. స్టార్ ప్లస్ లో వచ్చే నాచ్ బలియే రియాలిటీ డ్యాన్స్ షో తరహాలోనే ఇది కూడా సాగుతుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,