Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2017 09:50:19
facebook Twitter Googleplus
Photo

మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోందని. సుకుమార్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాపులో సాగే ఈ సినిమాలో మన మెగా హీరో మాస్ లుక్ తో అలరించనున్నాడు. అయితే ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చోటుచేసుకుంది.

యాక్చువల్ గా గోదావరి జిల్లాలో సమ్మర్ వేడి అదిరిపోతున్నా కూడా.. ఎందుకో ఈ సినిమా షూటింగులో ఉపాసన కూడా పాల్గొంటోంది. నిన్న కొల్లేరులో చరణ్ తో కలసి సందడి చేసిన ఉప్సీ... ఇప్పుడు భీమవరంలోని ఫ్యామస్ మావుళ్ళమ్మ గుడికి పతీసమేతంగా విచ్చేసింది. అక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ యథావిథిగా వీరిని ఫోటోలు తీయడంలో బిజీగా ఉంటే.. లోకల్ కాంగ్రెస్ నాయకులు చరణ్ రాక కోసం ఏర్పాట్లు చేశారు. ఇక చరణ్ అండ్ ఉపాసన శ్రద్దగా కుంకుమ పూజ నిర్వహించి తిరిగి తమ విడిదింటికీ బయలుదేరారు.

షూటింగ్ విషయానికొస్తే ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగుతోందని ఒక టాక్ వినిపిస్తోంది

,  ,  ,  ,  ,