Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 12:12:48
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ఫస్ డే మరియు ఫస్ట్ వీకెండ్ రికార్డులను కైవసం చేసుకున్న బాహుబలి 2 సినిమా... నార్త్ అమెరికాలో కూడా సత్తా చాటేస్తోంది. అక్కడ కూడా పెద్ద పెద్ద హలీవుడ్ మూవీలతో ఇట్టే పోటిపడింది ఈ తెలుగు సినిమా. మొత్తంగా అన్ని వర్షన్లనూ కలుపుకుని.. హాలీవుడ్ బాక్సీఫీస్ దగ్గర 3వ స్థానంలో నిలిచింది ఈ రాజమౌళి క్రియేషన్.

ఈ వీకెండ్ లో అమెరికన్ బాక్సాఫీస్ టాప్ 10 లిస్టు తీస్తే.. బాహుబలి 2 అందులో 3వ స్థానంలో నిలబడిందంటే పెద్ద విషయమే. హాలీవుడ్ బాక్సాఫీస్ ను చూసుకుంటే.. ''ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8'' సినిమా రచ్చ లేపింది. ఏకంగా ఈ వీకెండ్లో 19.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తరువాత రెండో స్థానంలో అందాల భామ సల్మా హయేక్ సినిమా ''హౌ టు బి యే లాటిన్ లవర్'' షుమారు 12 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు 3వ స్థానంలో.. 10 మిలియన్ డాలర్ల సుమారు వసూలు చేసిన బాహుబలి 2 సందడి చేస్తోంది. మొత్తానికి కేవలం 3 రోజుల్లో 10.1 మిలియన్ డాలర్ల కలక్షన్ రావడంతో.. 45 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ కొనుకున్న డిస్ర్టిబ్యూటర్లు త్వరలోనే రికవర్ అయిపోతాం అనే ధీమా వ్యక్తపరుస్తున్నారు.

మొదటి వీకెండ్లో దాదాపు ఇతర ఇండియన్ సినిమాలన్నింటికంటే బాహుబలి 2 ఏకంగా 100 కోట్లు ఎక్కువగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,  ,