Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2015 17:02:27
facebook Twitter Googleplus
Photo

ఉపేంద్ర ఏం చేసినా కొత్తగా కొంచెం తేడాగా ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూస్తే ఆ విషయం మహ బాగానే అర్థమవుతుంది. ఎ రా ఉపేంద్ర సూపర్.. ఇవన్నీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఉపేంద్ర ఆలోచనలు రెవల్యూషనరీగా.. మిగతా వారికి అందనట్లుగా ఉంటాయి. ఐతే ఉపేంద్ర మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా అంతే. అభిమానులందు ఉపేంద్ర అభిమానులు వేరయా అని చెప్పుకోవాల్సిందే వాళ్లను చూసి.

ఉపేంద్ర అభిమానులు తమ హీరోకు ఏమీ తీసిపోరని పైన కటౌట్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకప్పుడు ?ఉపేంద్ర? సినిమాకు డిఫరెంట్ కటౌట్ పెట్టారు. ఇప్పుడు వాళ్ల క్రియేటివిటీ హద్దులు దాటిపోయింది. ఏకంగా తమ హీరో కటౌట్ ను తలకిందులు చేసి పెట్టేశారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని థియేటర్లలో ఇప్పటికే ఇలాంటి కటౌట్లు దర్శనమిస్తున్నాయి. బహుశా సినిమా కటౌట్ల చరిత్రలోనే ఇలాంటిది ఇదే మొదలని చెప్పాలి.

,  ,  ,