ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ వంటి లవ్స్టోరీస్ని అందించిన ఆర్.జె.సినిమాస్ బేనర్ నుంచి మరో ప్రేమకథా చిత్రం వైశాఖం వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీడైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వైశాఖం చిత్ర విశేషాలను తెలియజేశారు.
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ