Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 10:51:30
facebook Twitter Googleplus
Photo

బిందాస్.. రగడ.. దూసుకెళ్తా.. ఇవీ రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరూ పోట్ల తీసిన సినిమాలు. పెద్ద హిట్లు కాకపోయినా మూడు సక్సెస్ ఫుల్ సినిమాలే. మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వీరూ.. దూసుకెళ్తా తర్వాత విక్టరీ వెంకటేష్-మాస్ రాజా రవితేజ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఏమైందో తర్వాత సమాచారం లేదు. దీనిపై ఇన్నాళ్లకు వీరూ ఓపెన్ అయ్యాడు. అప్పట్లో తాను ఈ ప్రాజెక్టు కోసం స్క్రిప్టు రెడీ చేసిన మాట వాస్తవమే అన్నాడు.

??వెంకటేష్.. రవితేజ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరిగిన మాట వాస్తవం. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. కథ రెడీ అంతా ఓకే. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మరో హీరోతో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను. అది కూడా రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. అందువల్లే నా కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఈ సినిమాలు ఆగిపోవడానికి కారణాలేంటో చెప్పలేను. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకోవడం కంటే నా టైం బాగోలేదు అనుకున్నాను. అలాగే నేనే మంచి స్ర్కిప్ట్ తీసుకెళ్లలేదేమో అని కూడా ఆలోచించాను. తర్వాత ?వీడు గోల్డ్ ఎహే? మొదలైంది. ఇక నుంచి గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను?? అని వీరూ తెలిపాడు.

,  ,  ,  ,  ,