Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 15:54:02
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి కానుకగా తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుండటంతో ఫుల్ జోష్ మీదున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో మరింత జోష్ తో ఉన్న బాలయ్య విజయోత్సవ యాత్రలు చేపట్టేశారు. ఇందులోభాగంగా అభిమానుల కోరిక మేర అమెరికాకు బయలుదేరివెళ్లారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వసూళ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సక్సెస్ జోష్ లో ఉన్న చిత్ర బృదం అమెరికాలోని పలు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననుంది. బుదవారం ఎన్టీఆర్ 21వ వర్థంతి కార్యక్రమాలు ముగిసిన అనంతరం అమెరికా బయలుదేరింది శాతకర్ణి టీం. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కో లోని అభిమానులను కలుసుకున్న బాలయ్య.. వారితో ఎంతో సరదాగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా రోజుకు రెండు థియేటర్ల చొప్పున నాలుగు రోజుల పాటు బాలయ్య క్రిష్ శ్రియ అభిమానుల సమక్షంలో విజయోత్సవాలను చేసుకోనున్నారు. ఈ సందర్భంలో అభిమానులతో ముచ్చటించిన బాలయ్య... అక్కడి విషయాలు వారినడిగి తెలుసుకుంటూ ఇక్కడి విషయాల ప్రస్థావిస్తూ గడిపారు. ఇదే క్రమంలో వారందరిపైనా చలోక్తులు విసిరిన బాలయ్య.. తనదైన జోకులు పేల్చారు.

,  ,  ,  ,  ,