Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 11:59:50
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా గురు షూటింగ్ మొదలైపోయింది. ఫస్ట్ షాట్ ని పిక్చరైజ్ చేసే ముందే.. ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేసిన వెంకీ.. ఈ సినిమాను ఏ స్పీడ్ లో తీయబోతున్నారో చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. వెంకీ బాక్సింగ్ కోచింగ్ కి సంబంధించిన సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

వైజాగ్ లో షెడ్యూల్ పూర్తి కాగానే.. గురు టీమ్ మొత్తం ఊటీకి షిఫ్ట్ అయిపోతున్నారట. ఇక్కడ తన స్టూడెంట్ కి బాక్సింగ్ సంబంధించిన కోచింగ్.. వర్కవుట్స్.. ట్రైనింగ్ వంటి సీన్స్ ని పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. గురులో ఎక్కువ భాగం షూటింగ్ ఊటీలోనే జరపాలని ప్లాన్ చేయడం విశేషం. ఓ మహిళా అథ్లెట్ ను బాక్సింగ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దే సీక్వెన్స్ మొత్తం ఊటీలోనే షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారట.

ఫస్ట్ లుక్ తోనే బోలెడంత ఆసక్తిని కలిగించిన గురు.. హిందీ-తమిళ్ మూవీ సాలాఖద్దూస్ కి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వెంకీ మినహాయిస్తే.. దాదాపు ఒరిజినల్ చేసిన వారంతా తిరిగి నటించనున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ నేర్చుకునే అమ్మాయిగా రితికా సింగ్ యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్ కానుందనే టాక్ ఉంది.

,  ,  ,  ,  ,  ,