Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2016 11:31:23
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మారుతితో చేసిన బాబు బంగారంతో భారీ సక్సెస్ కొట్టకపోయినా.. ఓపెనింగ్స్ తోను ఫుల్ రన్ కలెక్షన్స్ తోను బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు వెంకీ. అయితే తన తర్వాతి ప్రాజెక్టుగా సాలా ఖద్దూస్ కి తెలుగు రీమేక్ ని 'గురు' పేరుతో ప్రారంభించాడు వెంకీ.

మూవీ స్టార్టింగ్ కి ముందే వెంకీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి గురు యూనిట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఎవరూ ఊహించని రేంజ్ లో వెంకీ చేసిన మేకోవర్ యంగ్ హీరోలను కూడా మైండ్ బ్లాంక్ చేసింది. సెప్టెంబర్ 19న గురు షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ కి దర్శకురాలు సుధ కొంగర సిద్దమవుతోంది. దీపావళి సందర్భంగా పండుగ రోజున అంటే అక్టోబర్ 30న గురు టీజర్ ను లాంఛ్ చేయనున్నారట. వెంకీకి సంబంధించిన షాట్స్.. ట్రైనింగ్ కి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ఈ టీజర్ లో ఉంటాయని తెలుస్తోంది.

షూటింగ్ ప్రారంభించిన 5 వారాలకే టీజర్ ఇచ్చేస్తున్నారంటే.. గురు షూటింగ్ ఏ రేంజ్ స్పీడ్ లో పరిగెడుతోందో అర్ధమవుతుంది. అందుకే సెప్టెంబర్ లో షూటింగ్.. అక్టోబర్ లో టీజర్.. నవంబర్ లో ఆడియో అండ్ ట్రైలర్.. డిసెంబర్ లో మూవీ రిలీజ్.. ఇది గురుకు సంబంధించిన ప్లానింగ్. ఈ రేంజ్ స్పీడ్ లో ఏ స్టార్ హీరో సినిమా కూడా ఇప్పటివరకూ తెరకెక్కలేదు.

,  ,  ,  ,  ,  ,