రీమేక్ అంటే ముందుటారు వెంకటేష్. ఆయనకి ?రీమేక్ రాజా? అనే బిరుదూ వుంది. ఇప్పుడాయన చూపు మరో రిమేక్ పై పడింది. మాధవన్ నటించిన చిత్రం ?సాలా ఖాదూస్?.ఓ బాక్సింగ్ కోచ్ స్టోరీ ఇది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరనీ ఫ్యాక్టరీ నుండి వచ్చినీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ సినిమాని రీమేక్ చేయబోతున్నాడు వెంకీ.
ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో వస్తున్న ?బాబు బంగారం? తర్వాత వెంకీ చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ ని తెరకెక్కించిన సుధా ప్రసాదే దర్శకత్వం వహిస్తారని సమాచారం. హీరోయిన్ గా కూడా రితికసింగ్ నే తీసుకుంటారని తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.