Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 11:25:33
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్.. రెండో వీకెండ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ వీకెండ్ లోను.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లోను చాలానే రికార్డులు బద్దలు కొట్టేసిన గ్యారేజ్.. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు బోలెడన్ని లాభాలు పంచుతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే తన ఆల్ టైమ్ రికార్డ్ మూవీ నాన్నకు ప్రేమతోను దాటేసి.. ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్స్ లోకి దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ చిత్రానికి 'గురు' హీరో విక్టరీ వెంకటేష్ ఆశీర్వాదాలు కూడా వచ్చేశాయి.

'జనతా గ్యారేజ్ చూసా. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్.. మోహన్ లాల్ లు అద్భుతంగా నటించారు. టీం మొత్తానికి కంగ్రాట్స్' అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు వెంకటేష్. స్టార్ హీరోలు ఇతర హీరోలను పొగిడే సందర్భాలు.. వారి చిత్రాలను పబ్లిక్ గా ప్రశంసించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయ్ కానీ.. వెంకటేష్ మాత్రం ఇలాంటి లిమిట్స్ కి అతీతం. తనకు నచ్చితే ఆ విషయాన్ని ఎంత ఓపెన్ గా అయినా చెప్పేందుకు వెనుకాడడు. ఇప్పుడు గ్యారేజ్ నచ్చిందంటూ ప్రశంసలు కురింపించడానికి కారణం అదే.

ఇక జనతా గ్యారేజ్ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇవాళ సాయంత్రం ఆ మూవీ యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు గ్యారేజ్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వేడుక స్పెషళ్ మిగిలిపోనుంది.

,  ,  ,  ,  ,