Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2015 11:32:10
facebook Twitter Googleplus
Photo

ఇటీవల వరుసగా 'దృశ్యం', 'గోపాల గోపాల' వంటి జనరంజకమైన చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు వెంకటేష్ ప్రస్తుతం పలు కథలు వింటున్నాడు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు ఎన్వీ నిర్మల్ కుమార్ కూడా వెంకీని కలసి, ఓ కథ వినిపించాడట. ఇటీవల ఈ దర్శకుడు రూపొందించిన 'సలీం' చిత్రం తమిళంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెంకీకి కూడా ఈ చిత్రం బాగా నచ్చింది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పనిచేయాలని ఈ సీనియర్ హీరో డిసైడ్ అయ్యాడట. కథ కూడా నచ్చడంతో ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సురేష్ కాంపౌండులో చెప్పుకుంటున్నారు.

,  ,  ,  ,