Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2016 15:28:15
facebook Twitter Googleplus
Photo

నాగ చైతన్య హీరోగా నటించిన రెండు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమమ్.. ఈ రెండు సినిమాలూ సెప్టెంబర్ 9వ తేదీకే ఫిక్స్ అయ్యాయి. ఇరు సినిమాల నిర్మాతలూ ఒకే తేదీకి తమ సినిమాలను సెట్ చేయడంతో నాగ చైతన్య ఇదే విషయమై ఆయా నిర్మాతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. తాజాగా ఈ చర్చల అనంతరం గౌతమ్ మీనన్ సినిమా సాహసం శ్వాసగా సాగిపో, అక్టోబర్ మొదటి వారానికి వాయిదా పడింది.
ఇక ముందే అనుకున్న తేదీ ప్రకారంగా ప్రేమమ్, సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ?ఏ మాయ చేశావే? లాంటి క్లాసిక్ హిట్ అందించిన కాంబినేషన్‌లో వస్తోన్న ?సాహసం శ్వాసగా సాగిపో?, మళయాలంలో ఘన విజయం సాధించిన ?ప్రేమమ్‌?కి రీమేక్ అయిన ?ప్రేమమ్?.. ఈ రెండూ తనకు హీరోగా ఓ స్టార్ స్టేటస్ తీసుకొస్తాయని నాగ చైతన్య ధీమాగా ఉన్నారు. అక్టోబర్‌లో దసరా సీజన్‌కు ?సాహసం శ్వాసగా సాగిపో? రానుండడంతో ఆ సీజన్లో వచ్చే పెద్ద సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోయింది.

,  ,  ,  ,  ,  ,