Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 15:14:26
facebook Twitter Googleplus
Photo

ఏ టాలీవుడ్ డైరెక్టర్ కు రానంత క్రేజ్ జక్కన్నకు వచ్చేసింది. తెలుగు సినిమా గురించి.. తెలుగు దర్శకుడి గురించి బాలీవుడ్ టాప్ హీరోలు.. హీరోయిన్లు అస్సలు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైనా తెలుగు మీడియా ఎదురై.. తెలుగు సినిమాల్లో నటిస్తారా? అంటే.. మొహమాటానికి ముద్దుముద్దు మాటలు చెప్పటం చూశాం. జక్కన్న పుణ్యమా అని సీన్ రివర్స్ అయ్యింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. బాలీవుడ్ లో టాప్ టూ బాటమ్ వరకూ ఎవరైనా సరే.. తెలుగు మీడియా కనిపిస్తే చాలు.. బహుబలిని ప్రస్తావించటం.. రాజమౌళి గురించి మాట్లాడి.. ఆయన దగ్గర వర్క్ చేయటానికి తమకెలాంటి ఇబ్బంది లేదని చెప్పేస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలో బొద్దుగుమ్మ.. బాలీవుడ్ అందాల భరిణె విద్యాబాలన్ చేరిపోయారు. రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చేసిన ఆమె.. మిగిలిన వారి కంటే భిన్నంగా వ్యవహరించింది. మీడియాతో రాజమౌళికి మెసేజ్ వెళ్లేలా చేసింది. బాహుబలి 2 కోసం తాను ఆసక్తిగా చూస్తున్నానని.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న ఆలోచన వస్తే చాలు.. టెన్షన్ పెరిగిపోతుందని చెప్పుకొచ్చింది.

బాహుబలి 2 సినిమాను త్వరగా విడుదల చేయమని రాజమౌళికి అందరూ చెప్పాలంటూ.. తానెంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నది చెప్పుకొచ్చింది. ఒక సినిమా విడుదలై ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా.. ఇప్పటికీ అంతా సెకండ్ పార్ట్ కోసం ఇంతలా వెయిట్ చేయటం మరే సినిమాకు దక్కని గౌరవంగా చెప్పాలి. బాహుబలి 2 గురించి చెప్పేసిన విద్యాబాలన్.. తెలుగులో నటించటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మాటను చెబుతూ.. తనకు తగ్గ స్క్రిప్ట్ రావాలన్న కండీషన్ ను చెప్పింది. అంతలోనే.. రాజమౌళి సినిమాలో అవకాశం వస్తేనా.. అంటూ తన ఆసక్తిని వెల్లడించేసింది. జక్కన్న సినిమాలో యాక్ట్ చేయాలన్న మాటను చెబుతున్న వారి జాబితా పెరిగిపోతోంది. బాహుబలి 2 ఎప్పటికి విడుదల చేస్తాడో.. ఈ వెయిలింగ్ లిస్ట్ ను మరెప్పటికి క్లియర్ చేస్తాడో.. కాస్త.. వేగం పెంచండి.. రాజమౌళి.

,  ,  ,  ,