Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:21:53
facebook Twitter Googleplus
Photo

మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చాలానే మార్పులు వస్తుంటాయి. సినిమాని చూసే వాళ్ళు తీసే వాళ్ళ ఆలోచనల్లో మార్పులు వస్తూనే ఉన్నాయి. పెళ్లి తరవాత హీరోయిన్ గా నటించేందుకు అందాల భామలు పనికిరాదనే పాత నానుడికి.. ఇప్పుడు స్వస్తి పలికేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు.

ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ గా విద్యా బాలన్ ను చెప్పచ్చు. పెళ్లి కాకముందు ఎలాంటి సక్సెస్ లు కొట్టిందో.. పెళ్లి తరువాత కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేసేస్తోందీ బేగమ్ జాన్. ఇలాఎలా సాధ్యమైందంటూ విద్యా బాలన్ కు ప్రశ్న ఎదురైంది. మన చుట్టూ చాలా రకాల పనులు చేసే వారున్నారు. వాళ్ళంతా పెళ్లి తరువాత ఉద్యోగాలు మానేసారా? లేదు కదా! మరీ సినిమా హీరోయిన్లు ఎందుకు కొనసాగించకూడదు అంటోంది విద్య. తాను పెళ్లి అయ్యాక కూడా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. సినిమా అంటే నాకు చాలా ఇష్టమని.. ఎంతో గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీ అన్న డర్టీ పిక్చర్ భామ.. ఎప్పటికీ నటిస్తూనే ఉంటానని అంటోంది.

పెళ్లి తర్వాత ఏమి మార్పులు రాలేదా అన్న ప్రశ్నకు మొదట్లో కొన్ని మార్పులు రాక తప్పదు. వాటిని అర్ధం చేసుకొని కూర్చొని మాటలాడుకుంటే పోతాయి అంటూ చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది. పెళ్లయిన తరవాత నన్ను నా భర్త సిద్ధార్థ్ ని వేరుగా చూడరు. కాబట్టి నేను నా పర్సనల్ స్పేస్ ని ప్రొఫెషనల్ స్పేస్ ని సరిగా బ్యాలెన్స్ చేస్తున్నాను అని చెప్పింది.

,  ,  ,  ,  ,  ,