Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 13:26:29
facebook Twitter Googleplus
Photo

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్టైలిష్ ఎంటర్‌టైనర్ ఇజం..జులై 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెల్సిందే..కాగా ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. హరికృష్ణ గారి 60 వ పుట్టినరోజు సందర్బంగా ఈ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు..

సిక్స్ ప్యాక్ లో కళ్యాణ్ అదిరిపోయాడని అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు. గతం లో పూరి దేశముదురు చిత్రం లోను అల్లు అర్జున్ ను సిక్స్ ప్యాక్ లో చూపించి అదరగొట్టాడు..మళ్లీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ ను అదే లెవల్ లో చూపించడం జరిగింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరుకల్లా చిత్రీకరణ పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని డాషింగ్ డైరెక్టర్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిస్ ఇండియా 2015 అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్‌గా నటిస్తున్నాడని సమాచారం.

,  ,  ,  ,  ,  ,