Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 11:26:10
facebook Twitter Googleplus
Photo

తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఐతే తుపాకి వరకు అతడి సినిమాల్ని మన జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమా అతడికి కొంత మార్కెట్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత జిల్లా సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఐతే ఇక్కడొచ్చే సమస్య ఏంటంటే.. ఏదైనా తమిళ హీరో సినిమాలు ఒకట్రెండు ఆడగానే.. ఇక వరుసబెట్టి అన్ని సినిమాలూ వదిలేస్తారు.. వాటిలో ఒకట్రెండు తేడా కొట్టగానే కథ మళ్లీ మొదటికొస్తుంది. మన ప్రేక్షకులకు నమ్మకం పోతుంది. విజయ్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. పులి తో పాటు పోలీస్ తెలుగులో తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇప్పుడు విజయ్ లేటెస్ట్ మూవీ భైరవను కూడా తెలుగులోకి తెస్తున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘భైరవ’కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇది మరీ రొటీన్ సినిమా అన్నారు. విజయ్ కు ఉన్న క్రేజ్ వల్ల వసూళ్లయితే వచ్చాయి కానీ.. సినిమాలో అయితే ఏ ప్రత్యేకతా లేదని తేల్చారు క్రిటిక్స్. అసలే తెలుగులో రొటీన్ సినిమాలు నడవట్లేదు. అలాంటిది తమిళ ప్రేక్షకులకే నచ్చని సినిమాను ఇప్పుడు తెలుగు జనాలపై రుద్దుతారట. ఈ చిత్రాన్ని విజయ భైరవ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ కావడం.. జగపతి బాబు విలన్ పాత్ర పోషించడంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించివచ్చనుకుంటున్నారేమో.

,  ,  ,  ,  ,  ,