Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 12:43:35
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు యూత్ ఐకాన్ అనడంలో సందేహం అక్కర్లేదు. పెళ్లి చూపులు మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించి గుర్తింపు సంపాదించిన హీరో.. అర్జున్ రెడ్డి మూవీతో తనదైన స్టైల్ ను ప్రెజెంట్ చేయగలిగాడు. కుర్రాళ్లకు బాగా దగ్గరైపోయాడు. ఇలా అతి తక్కువ సినిమాలతో ఇంతటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే.

ఈ యంగ్ హీరో ఏం చేసినా ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. విజయ్ ప్రతీ మూవ్మెంట్ గురించి జనాలు ఆరా తీస్తున్నారు.. మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అయితే.. విజయ్ దేవరకొండ ఫ్యాషన్ హాట్ టాపిక్. ఇంతటి క్రేజ్ వచ్చాక.. రకరకాల ఈవెంట్స్ కు పిలుపులు రావడం.. అటెండ్ అవడం సాధారణమే. కానీ ఆయా కార్యక్రమాలకు ఇతగాడు వస్తున్న గెటప్పులే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఓ సారి ధోవతిలో.. కొన్నిసార్లు లుంగీ లుక్ లో వచ్చేస్తున్నాడు. షార్ట్ లెంగ్త్ నుంచి వైట్ షర్టుల వరకు.. డిజైనర్ నుంచి ప్లెయిన్ లుక్స్ వరకూ అన్నీ చూపించేస్తున్నాడు.

ఇక స్పెషల్ గా చేయించే ఫోటో షూట్స్ అయితే మరీ ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి చేనేత వస్త్రాలతో కూడిన డ్రెసింగ్స్ ను ఫోటోషూట్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. ఒక్కో చోట ఒక్కో లుక్.. మార్చి మార్చి మెస్మరైజ్ చేసేస్తూ షాక్ లు ఇచ్చేస్తున్నాడు అర్జున్ రెడ్డి హీరో.

,  ,  ,  ,  ,