Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:30:34
facebook Twitter Googleplus
Photo

ఇండియాలోనే అతిపెద్ద సినిమా అవార్డ్ షోగా చెప్పుకోవచ్చు ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. ఎందుకంటే ఈ అవార్డ్స్ ఇప్పటి నుండి కాదు కొన్ని దశబ్ధాల ముందు నుండి నిర్వహిస్తున్నారు. అయితే గతంలో మన సౌత్ లో హీరోలు హోస్ట్ గా చేయడానికి అంతగా ఉత్సాహం చూపే వాళ్ళు కాదు. హింది లో షారుక్ - సైఫ్ - రణబీర్ కపూర్ ఇలా స్టార్ హెరోలే చేసి షో ని మరింత ఆశక్తికరంగా డిజైన్ చేసేవాళ్ళు. కాని ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.

మొన్న జరిగిన IIFA అవార్డ్స్ లో కుర్ర హీరోలు నాని - రానా కలిసి షో ని బాగా హాండెల్ చేశారు. వాళ్ళు చేసిన డ్రామా కూడా అందరూ ఎంజాయ్ చేశారు. అంతకు ముందు ఏడాది అల్లు శిరీష్ అండ్ నవదీప్ కూడా ఇరగదీశారనే చెప్పాలి. ఇప్పుడు కూడా మన తెలుగులో ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ షో యాంకరింగ్ చేసే బాధ్యత యంగ్ హీరోలు అల్లు శిరీష్ - విజయ్ దేవకొండ తీసుకున్నారు. ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఉన్న నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా సౌత్ ఇండియా తారలు మధ్య జరగబోతుంది. అన్ని భాషలలో మంచి పోటీ ఉండటంతో షో మంచి ఆసక్తికరంగా ఉంటుంది అని తెలుస్తోంది. తెలుగులో కూడా గట్టి పోటీనే ఉంది. ఎవరెవరికి ఏమి వరించబోతుందో చూద్దాం.

అల్లు శిరీష్ ఇప్పటికే అవార్డ్ షో యాంకర్ గా మంచి అనుభవమే ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా దీని కోసం చాలా సాధన చేస్తునట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,