Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2015 11:19:09
facebook Twitter Googleplus
Photo

'కత్తి' సినిమాతో బాక్సాఫీసు వద్ద తన స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకున్న తమిళ హీరో విజయ్ త్వరలో ఓ ఇంగ్లిష్ సినిమాలో నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. యూరోపియన్ చిత్ర నిర్మాణ సంస్థ ఒకటి ఈ చిత్ర నిర్మాణాన్ని చేబడుతోంది. "ఇండియన్ నటుడు నటించాల్సిన కథ ఇది. దాంతో తమిళ నటుడు విజయ్ సూటవుతాడనిపించి అతనిని కాంటాక్ట్ చేస్తున్నాం. ఈ సినిమా అతనికి ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ ఇస్తుంది" అంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ప్రస్తుతం దీనికి సంబంధించి విజయ్ తండ్రి యస్.ఎ.చంద్రశేఖర్ తో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. దీనికి విజయ్ ఓకే చెబుతాడన్న నమ్మకంతో వున్నారు.

,  ,  ,  ,